కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

By dhanadhannews.com

జమ్మికుంట మార్చ్ 30:జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆయన వర్గీయులు శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని,ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా,ఇళ్ళందకుంట ఆలయ చైర్మన్ గా ఉమ్మడి జమ్మికుంట మండలానికి జెడ్పిసిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి తనకు అండగా నిలిచిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని తెలిపారు.కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు.కాని మళ్లీ కాంగ్రెస్ కండువ మెడలో వేసుకున్న తర్వాత తనకు గొప్ప అనుభూతి కలిగిందన్నారు.23సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో చేసానని గుర్తు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్, వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో పార్టీ కోసం పని చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో దొంత రమేష్  పీసీసీ మాజీ ఎస్సీ సెల్  కన్వీనర్,మాజీ జడ్పీటీసీ అరుకాల వీరశలింగం,కౌన్సిలర్లు బొంగోని వీరన్న, పోనగంటి సారంగం,దేశిని రాధా సదానందం, ఎలగందుల స్వరూప శ్రీహరి, పాల్గొనడం జరిగింది.

పార్టీ లో చేరిన వారు:టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారు జిల్లెల్ల తిరుపతి రెడ్డి మాజీ సర్పంచ్ భోగంపాడు ,నేరెళ్ల మహేందర్ మాజీ సర్పంచ్ చేల్పూర్, కళ్ళం సత్యనారాయణ రెడ్డి సింగిల్ విండో చైర్మన్,మధుసూదన్ రెడ్డి మాజీ చైర్మన్ ఇల్లంతకుంట దేవస్థానం,గణేష్ ఉపసర్పంచ్ పాతర్ల ఓదెలు,కందరపు విక్రమ్,దేశిని శ్రీనివాస్,మాజీ ఉపసర్పంచ్ కొత్తపల్లి,ఉడుత వెంకటేష్,దేవరాజ్, రామారావు, సంకిష సురేష్ ,రామచంద్రం, రాజకుమార్, ఓజ్జ శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,రామ్ రాజబాబు,ఎండి ఖలీల్ తదితరులు ఉన్నారు.