జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

By dhanadhannews.com

  • చిరుతల రామాయణం ఒక మహా దృశ్యరూపం
  • ఈ నెల 13న గరుడ కార్యక్రమంతో ప్రారంభం

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ గురువుల చేత రామాయణ మహా కావ్యాన్ని జగ్గయ్యపల్లి కళాకారులు నేర్చుకున్నట్లు తెలిపారు.రామాయణంలో భాగంగా ఈ నెల పదమూడవ తారీఖున గరుడ(మందిరం) కార్యక్రమముతో ప్రారంభమై,ఆదివారం నాడు గ్రామ దేవతలైన పోషమ్మ ఇతర దేవతలకు బోనాలు సమర్పించారు.గ్రామంతోపాటు,రామాయణం వేసే కళాకారులను చల్లగా దీవించమని వేడుకొన్నారు.ఈ సందర్భంగా రామాయణ కళాకారులు ప్రదర్శించే చిరుతల రామాయణం చూపర్లను ఆకట్టుకుంది.గ్రామంలో బోనాల సందర్భంగా పండుగ వాతావరణం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో చిరుతల రామాయణ కళాకారులు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.