- కనీసం డీజిల్ కూడా చూసుకోవడం లేదు
- కనీసం టెక్నీషియన్ అందుబాటులో ఉండడు
- అంబులెన్స్ లలో ఆక్సిజన్ సిలిండర్ ఉండదు
- హాస్పిటల్ యాజమాన్యాలతో అంబులెన్సు యజమానుల కుమ్మక్కు
- సిండికేట్ గా అంబులెన్సు యజమానులు
-అడిగినంత కిరాయి ఇవ్వాల్సిందే - అంబులెన్సు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లోకి
హుజురాబాద్,ధనాధన్ న్యూస్:
రోడ్డు మీద అంబులెన్సు వస్తుందంటే మనం ఎంత పనిలో ఉన్న అందులో ఉన్న పేషేంట్ ప్రాణాలు నిలువాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ,బండికి సైడ్ ఇస్తాము.కానీ అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానుల నిర్లక్ష్య వైఖరిలతో ప్రాణాలకు చేటు చేకూరుతుంది.వీళ్ళ నిర్వాహకం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..కనీసం వాహనాల్లో మౌలిక వసతులు లేకుండా,కనీసం డీజిల్,పెట్రోల్ కూడా చూసుకోకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.కనీసం ప్రథమ చికిత్స చేసే టెక్నీషియన్ కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ప్రజల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు డిమాండ్ చేసి దండుకుంటున్నప్పటికీ ప్రాణాలకు మాత్రం భద్రత లేదు.వీరి నిర్వాకం వల్ల ఎంతో మంది పేద ప్రజలు తమ కుటుంబ సభ్యులను, కుటుంబ పెద్దలను కోల్పోతున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకున్నారు.వీటిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు చర్య తీసుకుని మరికొంతమంది నిరుపేదల ప్రాణాలు గాల్లో కలవకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
