- బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు
హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు కల్పన, శ్రీవాణి అన్నారు. శుక్రవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు.సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, మనం ఏర్పరచుకున్న విలువలను కాపాడుకుంటూ జీవించడం అన్నారు. పరస్పర మాటలు, దృష్టి స్వభావ సంస్కారాలు నిష్కల్మషంగా ఉండాలనే రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారని తెలిపారు. ప్రజలందరూ పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, రాజయ్య, ఈశ్వరయ్య, నిరంజన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ యు మహేందర్, రాజు, వేణు,శ్రీనివాస్, సందీప్, గౌరవ్, అనిల్, తిరుపతి నాయక్,హరీష్, సతీష్, స్వామి, రాజేష్, అపూర్వ, రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.
