- జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి
జమ్మికుంట,ధనాధన్ న్యూస్:
జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి చెందిన కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.మానేరు పరివాహక ప్రాంతం నుండి అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపు లేదని చట్టం దృష్టిలో అందరూ సమానమే అని ఆయన తెలిపారు.అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గతంలో క్రిమినల్ కేసు నమోదు ఉన్న వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణా దారులను హెచ్చరించారు.ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు మీ సేవలో డబ్బులు చెల్లించి ఇసుక రీచ్ ల నుండి తెప్పించుకోవాలని అక్రమ ఇసుక రవాణాలను ప్రోత్సహించవద్దని ఆయన మండల ప్రజలకు తెలిపారు.
