- మొట్టమొదటి సారిగా అనాథశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది
- సాయి మానసిక దివ్యాంగుల పాఠశాల సిబ్బందిని, దాతలుగా వ్యవహరిస్తున్న వారిని అభినందిస్తున్నా
- ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందేలా చూస్తా
- పుట్టినరోజు వేడుకల్లో పట్ల భావోద్వేగానికి లోనైన ప్రణవ్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పిల్లలు అల్లరి చేస్తే మనం విసుక్కుంటామని,అలాంటిది దివ్యాంగులైన పిల్లలకు విద్య నేర్పడం,కోచింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని దాన్ని నిర్వహిస్తున్న,శిక్షణ ఇస్తున్న సిబ్బంది గొప్ప మనసు గల వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డులో గల సాయి మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలను ఆయన సందర్శించారు.పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి వంటగదిని,పాఠశాలలో మరమ్మత్తు చేసిన ఇతర వాటిని ఆయన ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గురువారం ప్రణవ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజే మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేయడం పట్ల ప్రణవ బాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.ఇలాంటి పిల్లల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి కావలసిన సహాయాన్ని అందేలా చూస్తానని తెలిపారు.అంతేకాకుండా ఇలాంటి పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి బుచ్చి రాములు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అనే ప్రత్యేకంగా అభినందించారు.ఈ పాఠశాలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్న దాతను కొనియాడారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల పాఠశాలల పట్ల ప్రతి నెల వారికి సమయానికి జీత భత్యాలు అందేలా చూస్థానని అన్నారు.గతంలో మాజీ ఎంపీ స్వర్గీయ రాజేశ్వర్ రావు ఈ పాఠశాల కోసం ప్రభుత్వంతో మాట్లాడి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారని,పాఠశాల నిర్మాణం కోసం కృషి చేశారని,వొడితల కుటుంబం అంటే మంచితనానికి మారుపేరని పాఠశాల నిర్వాహకులు కొనియాడారు.మన మధ్య మాజీ రాజ్య సభ్యలు స్వర్గీయ వోడితల రాజేశ్వర్ రావు గారు మన మధ్య లేకపోయినా ఆయన మనువడు రాజకీయ వారసుడిగా ప్రణవ్ బాబు ఆయనలో చూసుకుంటున్నమని అన్నారు.
