తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి జమ్మికుంట మండల అధ్యక్షుడిగా అనిల్ కొలుగూరి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా … Read more

కరీంనగర్ ను కరప్షన్,కలెక్షన్ కు కేరాఫ్ గా మార్చారు

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కళకళలాడే కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి,అక్రమాలకు నిలయంగా,కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 నుంచి నిన్నటి వరకు జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా గుట్కా మాఫియా మట్కా మాఫియా జట్కా మాఫియా నడిపింది,బిఆర్ఎస్ నేత లేనని వీరందరూ … Read more

ఎలాగందుల ఎంపీ స్థానం హస్తగతం అయ్యేనా?

ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే … Read more

పేద మహిళలను లక్పతీ దీదీలుగా తయారు చేయాలి

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలోని సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయం లో మంగళవారం రోజున సెర్ప్ సిబ్బంది వివోఏలకు లక్పతి దీదీ కార్యక్రమంపై డిపిఎం వంగ రవిందర్,ఎపిఎంలు తిరుపతి,కుమారస్వామిలు శిక్షణ ఇచ్చారు.శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం పరిదిలో ఎనభై మంది మహిళలను గుర్తించి వారిని ఫెసిలిటేట్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా,నైపుణ్యాలు కల్పించి పర్యవేక్షణ చేసే భాధ్యత రిసోర్స్ పర్సన్స్  చూడాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు … Read more

ఘనంగా లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపిఆర్ గార్డెన్స్ లో లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ డా.పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.తల్లితండ్రులు కూడా వారికి ఎన్ని పనులు ఉన్న కొంత సమయాన్ని పిల్లలతో కూడా గడుపుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులపై సమాజంపై … Read more

శివాజీ ఉత్సవ కమిటీ ఉన్నట్టా లేనట్టా

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గత సంవత్సరంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా ఆకునూరు గ్రామంలో శివాజీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్,స్వామి వివేకానంద,చత్రపతి శివాజీ విగ్రహాలను అన్నదానాలతో అంగరంగ వైభవంగా  ఆవిష్కరించారు.అంతవరకు బాగానే ఉన్నా,ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన తరువాత మొదట వచ్చిన జయంతి ఉత్సవాలను సోమవారం రోజున ఎవరు నిర్వహించలేదు.అందుకు గల కారణాలు ఏమైనా ఉత్సవ నిర్వహణ చేయకపోవడం మాత్రం గ్రామ ప్రజలను ద్రిగ్బంతికి గురిచేసింది.కనీసం వచ్చే … Read more

బాలవికాస స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయం

బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన వికాస బాలల పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు వొడితల ప్రణవ్ కి పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల … Read more

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జీ వొడితల ప్రజలకు సూచించారు. ఆదివారం ఇళ్ళందకుంట మండలం రాచపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జమ్మికుంట పట్టణానికి చెందిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని … Read more

మృతుని కుటుంబానికి పరామర్శ

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి  కేశవేణి రాయమల్లు(89) అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  25కిలోల బియ్యం అందజేయడం జరిగిందని,గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేసరు సంపత్,నీల కృష్ణ,అప్పాల మల్లేష్,కుందేళ్ళ సమ్మయ్య,పర్షవేణి విజయ్,టి శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య,కేశవేణి బాలయ్య  పాల్గొన్నారు.

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఒడితల ప్రణవ్

వీణవంక, ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శనివారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాతర కమిటీ అధ్యక్షున్ని ఆదేశించారు. భక్తుల కోసం మంచి నీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్నారు. అనంతరం జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర … Read more