karimnagarnews
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని … Read more
సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం
హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు … Read more
ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో ప్రజా ప్రతిభ క్యాలెండర్‌ను హుజురాబాద్ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.సారపు సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికా విలేకరులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు దిశగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వహించాలని పేర్కొన్నారు.అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర … Read more
ఘనంగా వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారం మహోత్సవం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్ కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాలుగా సిరిపురం రాజేష్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్, ఎల్లంకి ప్రదీప్,లతోపాటు వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, రివిజన్ చైర్ పర్సన్ రామిడి శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ అయితు రమేష్, వాసవి క్లబ్ అధికారులు కె … Read more
బోగస్ ఓట్లను తొలగించాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల … Read more
రంగాపూర్ కల్వరి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హుజురాబాద్,ధనాధన్ న్యూస్:మండల పరిధిలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో క్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నూతన వస్త్రాలు ధరించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సందడిగా సాంస్కృతిక ప్రదర్శనలు:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్యంగా … Read more
అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య … Read more
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదనీ,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూర్ ఎమ్మెల్యే … Read more
జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని … Read more