karimnagarnews
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఈరోజు శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతికాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ … Read more
పార్టీ కార్యకర్తలను కాపడుకుంటాం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు … Read more
ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్‌లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, … Read more
మూడోసారి మాల సంఘం అధ్యక్షునిగా వేలంగి ప్రేమ్ సాగర్ ఎన్నిక
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో మాల సంఘం అధ్యక్షుడిగా వేలంగి ప్రేమ్ సాగర్ మూడవసారి మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.మాల సంఘం నాయకులు గ్రామ ప్రజలు సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వేలంగి ప్రేమ్ సాగర్ కు ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వేలంగి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ మూడవసారి సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా కొనసాగింపు పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రతిక్షణం ప్రతి … Read more
పేదవారి కడుపునింపేలా కాంగ్రెస్ పాలన
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ … Read more
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 05:కరీంనగర్ టౌన్ జ్యోతి నగర్ శ్రీ సంతోషి మాత పంచముఖ వినాయక శ్రీ హనుమాన్ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు పులిహోర ప్రసాద వితరణ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చవిటి రామశర్మ, అర్చకులు రాంపల్లి రాజేశ్వర శర్మ, కార్తీక్ శర్మ, హనుమాన్ భక్తులు కోడిపల్లి కృష్ణ కృష్ణ స్వామి … Read more
అనాధ పిల్లలతో ఉగాది వేడుకలు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి … Read more
షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 29న 12:00 గంటలకు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 29న ఉదయం 10: 00 గంటల వరకు రూ. 5000 చిన్న షెటర్ గాను 10000 పెద్ద షెటర్ గాను డిపాజిట్ చెల్లించాలని … Read more