హీరోయిన్ ఛాన్స్ పేరుతో రూ.60 లక్షల టోకరా

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,మే 29: సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. “సీరియల్‌లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా” అంటూ ఓ ప్రముఖ వైద్యుడి భార్యను నమ్మబలికిన కేటుగాడు, దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ మోసంలో విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బాధితురాలికి టెలివిజన్, వినోద […]
ధనాధన్ న్యూస్ లో ప్రచురితమైన కథనానికి స్పందన

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న గోనెసంచుల సమస్యపై ధనాధన్ న్యూస్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. రైతులకు గోనెసంచులు అందించేందుకు నిరాకరించిన యజమాని, వార్త ప్రచురితమైన అనంతరం మంగళవారం ఉదయం వెంటనే సంచులు అందజేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ రైతుల సమస్యను పట్టించుకోని యజమాని వైఖరిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధనాధన్ న్యూస్‌లో కథనం వెలువడిన తర్వాత […]
దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది […]
ప్రవేట్ పాఠశాల వద్దు..గవర్నమెంట్ పాఠశాల ముద్దు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా “జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బొట్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు […]
అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి […]
కరీంనగర్ బంద్‌పై కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ-బీఆర్ఎస్‌పై వొడితల ప్రణవ్ తీవ్ర విమర్శలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం […]
గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన […]
తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని […]
కవ్వంపల్లి రవి కి దళితరత్న అవార్డు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 02: మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వైభవంగా జరిగింది.ఉత్సవాల కమిటీ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, lమాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ […]
వావిలాల గ్రామంలో వ్యక్తి మృతి.. కారణాలపై పోలీసుల విచారణ

వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి […]
