జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు మరియు వివిధ ఆర్గనైజేషన్ల నాయకులు కలిసి ప్రశ్నించడానికి వెళుతుంటే యావత్ తెలంగాణ నలుమూలల నిరుద్యోగులను వివిధ ఆర్గనైజేషన్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్ అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు నిరుద్యోగులు వివిధ ఆర్గనైజేషన్ నాయకులన్న ఎందుకు ఇంత భయం మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేపించిన ఎంతమందిని జైల్లో పెట్టిన వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుట్టేలా ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరిస్తా ఉన్నాము అని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేలుపూరి రాము, బి ఆర్ ఎస్వి టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్, సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం, పసునూటి వెంకటేష్ కెన్ని, కొత్త గణపతి రెడ్డి, డివైఎఫ్ఐ జమ్మికుంట అధ్యక్షులు కరంకొండ శ్రావణ్ కుమార్. నాయకులు పాల్గొన్నారు.
