- పేరుకే పెద్దాస్పత్రులు వైద్యులు మాత్రం ఉండరు
- సదుపాయాలు అంతంత మాత్రమే
- ఏడాది క్రితం నుంచి సమస్యలపై గళం వినిపిస్తోన్న సబ్బని వెంకట్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వా ఆస్పత్రుల్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితి నెలకొంది.ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా కాదు కనీసంగా కూడా లేకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మండలకేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయల,డాక్టర్‌ల కొరత ఉందని ఏడాది క్రితం నుంచి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ చెప్తూనే ఉన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గకేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కట్టించినంత మాత్రాన సరిపోదని, అందులో పది మంది నైపుణ్యం ఉన్న వైద్యులు కూడా లేరు అని చాలా సందర్భాల్లో వెంకట్ ఉద్ఘాటించారు. కరోనా తర్వాత అందరినీ వెంటాడేది గుండెపోటు భయమని,గుండెపోటు వచ్చిన వెంటనే సరైన సమయంలో స్పందించి హాస్పటల్ కి తరలించిన కూడా హాస్పిటల్ లో సరైన గుండె వైద్య నిపుణులు, వైద్య పరికరాలు లేక ప్రజలు మృత్యువాత పడుతున్నారని వివరించారు. నెలలో కనీసం నియోజకవ్యాప్తంగా పదుల సంఖ్యలో చనిపోతున్న కూడా అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదని ఏడాది క్రితమే ఓ ఇంటర్వ్యూలో వెంకట్ వ్యాఖ్యానించారు.
సబ్బని పదునైన మాటలకు ఉలిక్కిపడుతున్న రాజకీయవర్గాలు సబ్బని వెంకట్ మాట్లాడినా, అడుగేసినా రాజకీయ పార్టీల నాయకులు ఉలిక్కి పడుతున్నట్టు తెలుస్తోంది. సబ్బని ఏది మాట్లాడిన ఒక ట్రెండ్ సెట్ అవుతున్నదని,ఆయన పండ్ల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించి మద్దతుగా ఉంటానని ప్రకటించగానే.. రాజకీయ కల్లోలం చెలరేగింది.ఆయనకు రాజకీయ ఆపేక్ష లేకున్నా, ఎందుకు ప్రకటించారు.అసలే బలమైన నేత, పేద, మధ్య తరగతి ప్రజలలో విపరీతమైన వ్యక్తిగతమైన ఇమేజ్
ఉన్న వెంకట్ అడుగు వేయగానే ఒకింత భయందోళనలకు గురై వెంటనే..రాజకీయ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పరిచారు. మొన్న కూడా ఆయన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరికరాలు, డాకర్ల కొరత గురించి ఒక వీడియో విడుదల చేయగానే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారి పార్టీ ఆఫీసులో ఈ అంశం పైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటే వెంకట్, ప్రజలనే కాదు నాయకులను సైతం ఎంత ప్రభావితం చేస్తున్నారో అని ప్రజలు తీవ్ర చర్చ జరుపుతున్నారు.
జనం చూపు సబ్బని వైపు!
ఈటల రాజేందర్‌ను ప్రస్తుతం దాదాపుగా హుజురాబాద్ ప్రజలు, కార్యకర్తలు మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదే. హుజురాబాద్‌లో 20 ఏండ్ల కాలంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు కానీ, నిరుద్యోగుల కోసం పరిశ్రమలు, విద్యార్థుల కోసం కళాశాలలు నిర్మించలేదనే అభిప్రాయం ప్రతి యువకుడిలో నాటుకుపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈటల రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడం, ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వల్ల ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి గెలిచినా, కాంగ్రెస్ పార్టీ నుండి ప్రణవ్ మీద కొంత సానుభూతి ఉన్నా నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందన్న చర్చ ఉంది. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సబ్బని వైపు చూస్తున్నారు. ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అన్ని పార్టీలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందనేది రాజకీయ వర్గాల మాట. హుజురాబాద్ ప్రజలు మాత్రం వెంకట్ ద్వారా ఒక కొత్త రాజకీయం చూస్తున్నారు. ఎప్పుడు, ఏ విధంగా అడుగులు వేస్తాడో? అని ఆయన వ్యూహం ఏంటో అర్థం కాక రాజకీయ నాయకులు తలలు పట్టుకుని ఆలోచన చేస్తున్నారు. ఆయన వస్తే సగం మంది 2 వ స్థాయి నాయకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందనే చర్చ ఉంది. మొత్తంగా సబ్బని వెంకట్ కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారారు.
అజాతశత్రువు ‘సబ్బని’
పదునైన మాటలతో ఎదుటివారిని ఆలోచింపజేసే విధంగా సబ్బని వెంకట్ మాట్లాడుతున్న తీరును హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానీకం నిశితంగానే గమనిస్తోందని చెప్పొచ్చు. రాజకీయ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో పేరు సంపాదించుకున్న సబ్బని వెంకట్.. అజాతశత్రువుగా పేరు గాంచారు. సేవా కార్యక్రమాలతో అందరి హృదయాలతో స్థానం పొంది..ఆదరాభిమానాలు చూరగొన్న వెంకట్ ను నాయకుడిగా చూడాలని కొందరు భావిస్తున్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని కేవలం ‘నాయకుడి’ నని సబ్బని వెంకట్ స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ..సమీప భవిష్యత్తులో ఆయన అడుగులు, ఆలోచనలు రాజకీయాల్లోకి వచ్చేలా ఉంటాయోమననే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
