- అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులలకు నూతన భవనాలు నిర్మించాలి
- ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
సైదాపూర్ మార్చ్ 30:సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపుర్ లోనే నూతన భవనం నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కోరారు.వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని నూతన భవనాలు నిర్మించాలని,ఎన్ని మార్లు కోరినా పట్టించుకోలేదని గత కొన్ని సంవత్సరాలుగా సైదాపూర్ గురుకుల పాఠశాల హుజురాబాద్ మండలం లో రైస్ మీల్లుల దగ్గర అద్దె భవనాల్లో నడుపుతున్నారని మీల్లుల ద్వారా వచ్చే పొగ వల్ల విద్యార్థులకు చర్మ సమస్యలు శ్వాశకోశ సమస్యలు వస్తాయని ఇలా జరగడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని,వెంటనే మంత్రి స్పందించి సైదాపుర్ లోనే గురుకుల పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని రామారపు వెంకటేష్ కోరారు.
