- బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సభ్యత్వ నమోదు అనేది పార్టీకి పునాది లాంటిదని,కార్యకర్తలే బిజెపి పార్టీ బలం అని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.ఈరోజు వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యాశాల (సన్నాహక సమావేశం) జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎరబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు వెళ్తాయని,కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని,ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని,సమిష్టి నిర్ణయం ప్రకారం ముందుకు వెళుతుందని సంపత్ రావు తెలిపారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కార్యకర్త సభ్యత నమోదు చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే 11 కోట్ల పైచిలుకు సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని సంపత్ రావు గుర్తు చేశారు.కేంద్రంలోని బీజేపీ (నరేంద్ర మోడీ) ప్రభుత్వం గత పది సంవత్సరాలలో దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని సంతోషించారు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మోడీ పరిపాలన వున్నదని సంపత్ రావు కితాబిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరని, వారు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయిందని, బిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం మొత్తం అధోగతి పాలు అయిందని ఇక ఆ పార్టీకి తెలంగాణలో వునికి ఉండదని సంపత్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు అండగా బిజెపి పార్టి అనేక ఉద్యమాలు చేస్తుందని,తెలంగాణ ప్రజలు కూడా బిజెపి తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నారని,మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓటు బ్యాంకు దానికి నిదర్శనమని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన నరేంద్ర మోడీ సభ్యత నమోదును ప్రారంభిస్తారని,ప్రతి బీజేపీ కార్యకర్త నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున బిజెపి సభ్యత్వం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.తటస్థంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా యువతను,మహిళలను,రైతులను పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,మండల అధ్యక్షుడు రామిడి ఆది రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్ నాయకులు పెద్ది మల్లారెడ్డి వీరాస్వామి సమ్మయ్య ఎంపిటిసి స్వామి,ఎనగంటి శ్రీనివాస్, రవీందర్,వెంకటేశ్,రవీందర్,కుమార్,మధునయ్య, దేవేందర్ రెడ్డి,సందీప్,తదితరులు పాల్గొన్నారు.
