- దళిత బందు నిధులు విడుదల చేసి దళిత కుటుంబాలను ఆదుకోవాలి
- సీఎం కి పోస్ట్ ద్వారా లేఖని పంపిన మాజీ జడ్పీటీసీ డాక్టర్.శ్రీరామ్ శ్యాం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నియోజకవర్గం రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పోస్ట్ ద్వారా వినతి పత్రం పంపడం జరిగింది.ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారని వారు గుర్తు చేశారు. కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే 10 లక్షల రూపాయల మొత్తం నిధులను కేటాయించారు. మిగతా కొంతమంది దళిత కుటుంబాలకు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అందాయని వారు గుర్తు చేశారు. మిగతా ఐదు లక్షల రూపాయలు కేటాయించవలసిందిగా దళిత కుటుంబాలు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన వారికి న్యాయం జరిగే లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దళిత కుటుంబాలు 5 లక్షల రూపాయలతో అనేక వ్యాపారలు కొనసాగిస్తున్నారని వాటి మూలంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం రాకపోవడం మూలంగా వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని వారు గుర్తు చేశారు.హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు కుటుంబాలు రెండవ విడత నిధులను విడుదల చేయవలసిందిగా అనేకసార్లు రాస్తారోక అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రెండోవ విడత దళిత బందును వెంటనే విడుదల చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరిగింది.
