- డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ,రేగుంట సునీల్ మాదిగ
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత పదేండ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో లెదర్ పార్కులపై చిన్నచూపు చూసిందని పూర్తిగా మాదిగల పట్ల వివక్ష చూపిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మరియు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లెదర్ పార్కు ను సందర్శించిన సందర్భంగా స్థానిక లెదర్ పార్కు కమిటి నాయకులతో కలసి వారు మీడియా తో మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో వెనుకబడిన మాదిగలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాదిగల బ్రతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు. అందుకోసం కాంగ్రేస్ పార్టీ గెలుపులో మాదిగలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను ఆదుకుంటారని, లెదర్ పార్కులను ప్రారంబిస్తారనే ఆశ, నమ్మకం మాలో ఉన్నదని,దానిని నిలబెట్టుకునే విదంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పటికే లిడ్ క్యాప్ ఆద్వర్యంలో శిక్షణ ప్రారంభమైందని, అక్కడ లెదర్ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించారు. ఇక్కడ కూడా లెదర్ కార్పొరేషన్ కు వెంటనే చైర్మన్ ను నియమించాలని, స్టేషన్ ఘన్పూర్ మెగా లెదర్ పార్కు చేస్తూ అన్ని జిల్లాల్లొ ఉన్న లెదర్ పార్కులను అనుసంధానం చేసి ప్రారంబించాలని కోరారు. గతంలో ట్రైనింగ్ తీసుకున్న వారిని లెదర్ పార్కులో ఉద్యోగాలు కల్పించి, కొత్తగా ట్రైనింగ్ చేసేవారికి శిక్షకులుగా నియమించాలని కొరారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా టీమ్ కవ్వంపల్లి రవి మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు అందె భవాని రెడ్డి మహిళా ఇంచార్జ్ మాట్ల రమేష్ మాదిగ జిల్లా అధ్యక్షులు ఎల్కపల్లి రాజెందర్ రాష్ట్ర నాయకులు కుడెల్లి ప్రవీణ్ మాదిగ రాష్ట్ర నాయకులు శనిగారం కవిత మహిళా కన్వీనర్ గుల్లి రామన్న నాయకులు,లెదర్ పార్కు కమిటి సభ్యులు మోతె స్వామి అధ్యక్షులు మారపెల్లి పోశెట్టి ఉపాధ్యక్షులు శనిగారపు సంపత్ ప్రధాన కార్యదర్శి శనిగారపు రమేష్ ఆర్గనైజర్ ఇమ్మిడి రాజు సబ్ ఆర్గనైజర్ రాచపల్లి మానేష్ కోశాధికారి నాయకులు కొమురయ్య,మోరె రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
