ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య

By dhanadhannews.com

  • ప్రజాస్వామ్యంలో అరెస్టులు సరికాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  హైదరాబాదులోతన నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం హేయమైన  చర్య అని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు.తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారా హిల్స్ ఏసిపి అనుమతి తోనే ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని అన్నారు.పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇయ్యడానికి వెళ్తే విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు చేయడం పోలీసుల విజ్ఞతికేవదిలేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే ఇంటి  సరళిలో 100 మంది పోలీసులు పెట్టి ఇంట్లో చొరబడి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు.ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం  పోరాడుతామని వారు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతూ ప్రజా పక్షాన ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ప్రతాప్ తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు,మక్కపల్లి కుమారస్వామి, బిఆర్ఎస్వి నాయకులు విడపు అనురాగ్,శివసాయి,  గాలి సాయి,అనుదీప్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.