- నేత్రదానంతో ఇద్దరికి చూపు
- అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
- నేత్రాలను సేకరించిన ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ రేణుక,మనోహరరావు,రాణి,కృష్ణ లకు,సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు,జి.రాజమౌళి,గర్రెపల్లి మనోహర్ లకు,సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్,గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు పృథ్విరాజ్,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి మరియు బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.
