మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన వోడితల ప్రణవ్

హుజురాబాద్ ఏప్రిల్ 6:బోర్లపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో మొరం టిప్పర్ లారీ ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై బోల్తా పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, గంట వర్ష తో పాటు సింధుజలు మృతి చెందారు. బోర్నపల్లి ముదిరాజ్ బోనాల జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ … Read more

పెద్దంపల్లిలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ,నాగమ్మ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

జమ్మికుంట ఏప్రిల్ 05:జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ ,నాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది.పెద్దంపల్లి  గ్రామంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున వినాయక హోమం తో మొదలై ఆదివారం వనభోజనాలతో ఈ ప్రతిష్టాపన పూర్తవుతుందని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండలం ఎంపీపీ దొడ్డే మమత,పెద్దంపల్లి సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ,వార్డ్ నెంబర్లు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

దుద్దేనపల్లీ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్

సైదాపూర్ ఏప్రిల్ 03:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లీ గ్రామంలో బుధవారం  రోజున సిఎస్ఎఫ్ పోలీస్ బృందంతో  గ్రామంలో కవాత్ నిర్వహించడం జరిగిందని సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పి వెంకట్ మాట్లాడుతూ ఎలక్షన్లను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని,ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియపరిచారు.ప్రస్తుత పరిస్థితులను సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని గాని మతం పేరుతో గాని కులం పేరుతో గాని వివాదాస్పరమైన ఎలాంటి … Read more

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం

హుజురాబాద్ మార్చ్ 31:హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్ట్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్న ముంజాల సంపత్ పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సంపత్,రమాదేవి దంపతులను బంధువులు, సహచర ఉద్యోగులు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయంలో సంపత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి పేరు … Read more

ప్రణవ్ బాబు కు సోలార్ ఫ్యాన్ టోపీని బహూకరించిన సాదుల రాంబాబు

వేసవి కాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కాంగ్రెస్ వీరాభిమాని సాదుల రాంబాబు దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సోలార్ ఫ్యాన్  పరికరంతో క్యాప్ లో ఇమిడే విధంగా సోలార్ ఫ్యాన్ తయారుచేసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు సింగపూర్ లోని తన నివాసంలో బహుకరించారు.అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోలార్ ఫ్యాన్ టోపీని ఉగాది సందర్భంగా అందజేసేందుకు అవకాశం కల్పించాలని ప్రణవ్ ను కోరారు.వెంటనే స్పందించిన ప్రణవ్ ముఖ్యమంత్రి … Read more

హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్

హుజురాబాద్ మార్చ్ 28:న్యాయవాదుల సంఘం కు గురువారం జరిగిన ఎన్నికలలో హుజురాబాద్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా బండి రమేష్,ప్రధాన కార్యదర్శి గా మట్టెల తిరుపతి , లైబ్రరీ సెక్రటరీ అప్పని రాజు, కోశాధికారి గా ఎం దివ్య,సీనియర్ ఎక్సిక్యూటివ్ మెంబర్ గా  పులుగు లింగారెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు కె.భగవాన్ రెడ్డి, సికె జేమ్స్,ఎన్. సత్యనారాయణలు తెలిపారు.మొత్తం 115   మంది ఓటర్లకు గానూ 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అధ్యక్ష పదవికి  పోటీ … Read more

జయత్ జయత్ సినిమాని ప్రారంభించిన ప్రణవ్

హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం జయతు జయతు సినిమా షూటింగ్ నిర్వహించారు.సినిమా షూటింగ్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సినిమా దర్శక, నిర్మాతలు యూనిట్ సభ్యులను అభినందించారు. గ్రామంలో షూటింగ్ కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులున్నారు.

మానవత్వాన్ని చాటుకున్న ఒడితేల ప్రణవ్

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. … Read more

కెమెరా కళ్ళకు రాష్ట్రస్థాయి అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో, “కెమెరా ఐస్” పేరిట,హైదరాబాద్ కేబిఆర్ పార్కులో, బుధవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో, జమ్మికుంటకు చెందిన ఫోటో గ్రాఫర్ విజయగిరి రాంబాబు ద్వితీయ బహుమతి అందుకున్నారు. అటవీ సంపద,వన్యప్రాణులు,పక్షులు,తదితరాలను తన కెమెరాలో అద్భుతంగా నిక్షిప్తం చేసినందుకుగాను ఈ అవార్డు ప్రధానం చేశారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంసీపర్గెన్, కన్జర్వేటర్ ఎం.శివాని డోగ్రా తదితరులు ఈ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా,పలువురు ఫోటోగ్రాఫర్ రాంబాబును అభినందించారు.

మహిళా సదస్సు ని విజయవంతం చేయండి

Make the women’s conference a success