హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం,పార్టీ ఇన్చార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
