హుజురాబాద్/ధనధాన్ న్యూస్: హుజూరాబాద్ మండలం కనుకూలగిద్ద గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లను హుజురాబాద్ డిపో మేనేజర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని కోరారు.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం,పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ ఎం.సురేందర్ మరియు ఆర్టీసీ సిబ్బంది జి.స్ రెడ్డి,ఎల్లయ్య,సాయిచరణ్,గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
