జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి లో జరిగిన బాలసభ సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి.తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ వారు విద్యార్థులను సాంస్కృతికంగా సాహిత్య పరంగా అభివృద్ధిపరిచేందుకై ప్రతినెల నాలుగవ శనివారము ‘నో బ్యాగు డే’ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న సృజణాత్మకత శక్తులను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమము ఉపకరిస్తుందని విద్యార్థిని విద్యార్థులు బాలసభను ఉపయోగించుకొని చక్కటి సాంస్కృతిక నిర్వహించాలని కవితలు,గేయాలు,పాటలు వినిపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్యాలు,విద్యార్థులు పాడిన పద్యాలు గేయాలు అద్భుతంగా అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ రాజేందర్,రమేష్,అవినాష్,ఐలయ్య మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
