బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

By dhanadhannews.com

  • ప్రధాని ఎవరో చెప్పే దమ్ముందా?
  • కాంగ్రెస్,బీఆర్ఎస్ కుమ్కక్కై ఆరు గ్యారంటీల అమలు కాకుండా డ్రామాలాడుతున్నరు
  • ఆరు గ్యారంటీలను కాకి ఎత్తుకెళ్లే రోజులు రాబోతున్నయ్
  • ఎన్నికల సాకుతో హామీల అమలుపై దాట వేయబోతున్నరు
  • జమ్మికుంట టౌన్ ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని గర్వంగా చెబుతున్నాం.మరి కాంగ్రెస్ గెలిస్తే ప్రధానమంత్రి ఎవరో ప్రకటించే దమ్ముందా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.ప్రజాహిత యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు.జమ్మికుంట ల మీటింగ్ స్టార్ట్ అయ్యింది.కరీంనగర్ ఎంపీ నాకు సీటు ప్రకటించారు. జమ్మికుంటను జన్మ లో ఎప్పుడూ మరిచిపోనని సంజయ్ అన్నారు.దయచేసి పువ్వు గుర్తుకి ఓటేయండి. ప్రధాని మోదీనీ గెలిపించండని,నరేంద్ర మోడీ గెలవాలంటే బీజేపీ గెలవాలని,మోదీ గెలిస్తేనే పేదల రాజ్యం కొనసాగుతుందని అన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ కావాలా వద్దా అని,ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు అని దేశం లో బీజేపీ గెలిస్తే ప్రధాని మోడీ అని,మరీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధాని ఎవరో ఇప్పుడు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.కాళేశ్వరం పేరిట కాంగ్రెస్.. పాలమూరు పేరిట కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నాయని,కేసిఆర్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.నేను ఎంపీ గా హుజూరాబాద్ అభివృద్ది పనుల కోసం 480 కోట్ల రూపాయలకుపైగా కేంద్రం తెచ్చానని తెలిపారు.హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు కోసం 4900 మంది దరఖాస్తు చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని,వాళ్లకు దళిత బంధు వచ్చే వరకు పోరాడతానని ఎంపీ సంజయ్ కుమార్ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో తప్పు చేయకండని, మోదీని మళ్లీ ప్రధాని చేయాల్సిన అవసరం మనందరిపైనా ఉందని ప్రజలను కోరారు.