మానవత్వాన్ని చాటుకున్న ఒడితేల ప్రణవ్

By dhanadhannews.com

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన వైద్యులకు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తి ని దవాఖాన కి పంపిస్తున్నామని ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.