పొలిటికల్ బ్రోకర్ పాడి కౌశిక్ రెడ్డి

By dhanadhannews.com

  • కౌశిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే నాలుక చీరేస్తాం
  • కుటుంబ సభ్యులను ముందు పెట్టుకొని ఓట్లలో గెలిచిన నీకు పొన్నం గురించి మాట్లాడే అర్హత లేదు
  • పులి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్

సైదాపూర్ మార్చ్23:హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్,కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్  మాట్లాడుతూ
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.రాజకీయ వ్యభిచారి కౌశిక్ రెడ్డి అని , మొన్నటి ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే శవ యాత్ర చేస్తా అని చెప్పి మహిళలను సెంటిమెంట్ తో ఆకట్టుకొని గెలిచిన వాడని తెలిపారు.కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు.

పొన్నం ప్రభాకర్ పై మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక ఛీరెస్తాం అని హెచ్చరించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు నీకు కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ భిక్ష పెడితే నేడు నువ్వు హుజురాబాద్ లో రాజ్యమేలుతున్నావని అన్నారు.నువ్వు చేయని అరాచకం లేదు,పోలీసుల నుండి మొదలు అధికారులపై నువ్వు అసభ్య పదజాలంతో విరుచుకు పడింది నిజం కాదా అని,తాడి చెట్టు అంత ఎత్తు ఎదిగిన నీకు దున్న పోతుకు ఉన్నంత దిమాక్ కూడా లేదని వారు అన్నారు.