జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఈ నెల 18వ తారీఖున జరిగే సర్వాయి పాపన్న 374 వ జయంతి గ్రామ,గ్రామాన వాడవాడల ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న కీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూదరి విజయ్ పిలుపునిచ్చారు.జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బడుగు,బలహీనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని అలాంటి వ్యక్తి జన్మదిన ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.రానున్న రోజుల్లో గీత కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి తమ సమస్యలను తెలుపుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు మూటబోతుల దేవేందర్ గౌడ్,గౌడ సంఘం సీనియర్ నాయకులు బుర్ర నర్సయ్య గౌడ్,పూదరి శ్రీనివాస్ గౌడ్,మోతుకూరి శ్రీనివాస్ గౌడ్,దాసరి రామ్మూర్తి గౌడ్,దొమ్మటి రాజు గౌడ్,శ్రీపతి సురేష్ గౌడ్,పచ్చమట్ల మొగిలి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
