assembly telangana
బోగస్ ఓట్లను తొలగించాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల … Read more
పేదవారి కడుపునింపేలా కాంగ్రెస్ పాలన
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ … Read more
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సందర్భంగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధుల పాలు అయ్యే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్నేహితులతో సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి జీవితాలను నాశనం అయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల … Read more
ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేవరకు గ్రూప్స్ ఫలితాలను నిలుపుదల చేయాలి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాక ముందే నేడు గ్రూప్1 ఫలితాలు ప్రకటించడం, అదేవిధంగా ఈనెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 అదేవిధంగా … Read more
జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రాయికల్ గ్రామ రైతులు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీవో సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డిఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12 లక్షల 20,000 ఇస్తారని హుజురాబాద్ … Read more
ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ … Read more
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో భాగంగా చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది అనంతరం హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూస్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి, ఆదరించాడు. నిజాంషాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి … Read more
ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను అట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, … Read more
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్న దృశ్యాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహార్నిషలు శ్రమించి … Read more