ఇక అంగన్వాడీలోనూ యూనిఫామ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్‌ ఉండనుంది.ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్‌ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్‌ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌ అందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో … Read more

ప్రభుత్వాస్పత్రికి వాటర్ డిస్పెన్సర్ ను అందించిన ముశం శ్రీనివాస్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వాస్పత్రి సేవలపై  నమ్మకం కలిగించేందుకు రాంపూర్ గ్రామానికి చెందిన ముషం శ్రీనివాస్ తన భార్య ప్రత్యూషను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి డెవలరీ చేయించిన ఆలోచన గొప్పదని ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో సుధాకర్ రావు కొనియాడారు. కాగా ముషం శ్రీనివాస్ తనకు పాప జన్మించిన సందర్భంగా ప్రభుత్వాస్పత్రికి తన వంతు సాయం అందించాలనే సంకల్పంతో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సుమారు 10వేల విలువ చేసే వోల్టాస్ వాటర్ … Read more

ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక  మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి  నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్  ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన  కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ … Read more

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని ఈ తరుణంలో మహిళా లోకం మరింత … Read more