police
పండుగల వేళ వాట్సాప్ స్కాంల మోత
కరీంనగర్/ధనధన్ న్యూస్: పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో వాట్సాప్ ద్వారా స్కాం మెసేజెస్ ఊపందుకుంటున్నాయి.ప్రత్యేకంగా “మీకు ₹5,000 వచ్చాయి”అనే తరహా సందేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ఈ మెసేజెస్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాట్సాప్ ల్లోనూ విస్తృతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి.తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది.ఇది పూర్తిగా సైబర్ మోసమేనని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో హానికర సాఫ్ట్‌వేర్ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.దీంతో బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు … Read more
జమ్మికుంట ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం – దంపతులకు గాయాలు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 3:జమ్మికుంటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే,తనుగుల గ్రామానికి చెందిన బొల్లు మధుకర్ రెడ్డి తన భార్య బొల్లు శ్రీలతతో కలిసి ద్విచక్ర వాహనంపై (AP 15 AY 9284) ఆగస్టు 27న జమ్మికుంటకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి తనుగుల గ్రామానికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి, వెనుక నుంచి అతివేగంగా నుంచి వచ్చిన కారు (TS 02 … Read more
జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు
జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో … Read more
సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
సైదాపూర్ ఎస్ఐగా సిహెచ్ తిరుపతి నియామకం
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ఎస్ఐగా సి.హెచ్ తిరుపతిని నియమించినట్లు కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారి చేశారు.గతంలో సైదాపూర్ ఎస్సై గా విధులు నిర్వహించిన జన్ను ఆరోగ్యంని జమ్మికుంట ఎస్ఐగా బదిలీ చేయగా కరీంనగర్ వీఆర్ లో ఉన్న సిహెచ్ తిరుపతి సైదాపూర్ ఎస్ఐగా నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అగ్ని ప్రమాద చిరు వ్యాపారులకు పోలీసుల చేయూత
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: నిన్న రాత్రి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు.హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ.3000 చొప్పున 30,000 నగదును పదిమందికి అందజేశారు.అగ్ని ప్రమాదం సంభవించి చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేయడం అత్యంత … Read more
ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు
సైదాపూర్ (ధనాధన్ న్యూస్ )జూన్ 02:సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ&బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ … Read more