హుజురాబాద్,జమ్మికుంట మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం: ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు.హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ … Read more

వీణవంక మండలంలో కాంగ్రెస్ ప్రచార జోరు!

వీణవంక/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది. శనివారం రోజున బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టం పేట, గంగారం, చల్లురు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, బాణాసంచా కాల్పులతో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను … Read more

కనగర్తి ప్రజలారా! ఇది కేవలం ఎన్నిక కాదు, మన గ్రామానికి ‘పునర్జన్మ’!

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: గ్రామ చరిత్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి, పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన శ్రీమతి బండి సంధ్యారాణి మల్లేష్ తీవ్ర ఉద్వేగంతో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఈ ఎన్నికను కేవలం పదవి కోసం కాదని, గ్రామానికి పునర్జన్మ ఇవ్వడం కోసం జరుగుతున్న చారిత్రక పోరాటంగా అభివర్ణించారు.జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ సతీమణి అయిన సంధ్యారాణి మల్లేష్ మాట్లాడుతూ, “మీరు నన్ను 10 ఏళ్లుగా … Read more

దళిత బంధు నిధులపై వివక్ష ఏంది!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుడిపై కోపాన్ని … Read more

ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టణ ప్రజల ప్రాణాల పట్ల వారి ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం. బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ఒకవైపు రిలయన్స్ పెట్రోల్ పంపుకు ముందు, మరొకవైపు బస్టాండ్‌కు వెళ్లే దారిలో భారీగా, ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు గత కొంతకాలంగా వాహనదారులకు,స్థానికులకు నరకాన్ని చూపుతున్నాయి.ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం మున్సిపాలిటిని రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉంచుతున్న మున్సిపల్ అధికారులు , పట్టణ … Read more

చెక్ డ్యాం కుంగడంపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాం కుంగిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం తీవ్రంగా ఖండించారు. రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రణవ్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే చర్యలుచెక్ డ్యాం కుంగడంపై ప్రస్తుతం విచారణ … Read more

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు: ఒడితెల ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక … Read more

మల్లన్నపల్లి గ్రామ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తా: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గంధం రవీందర్

ఇల్లందకుంట, నవంబర్ 25: ఇల్లందకుంట మండల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం తాను అలుపెరుగని పోరాటం చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న గంధం రవీందర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.మంగళవారం గంధం రవీందర్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో … Read more