తీన్మార్ మల్లన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

By dhanadhannews.com

  • కోఆర్డినేటర్ పోతుల రాజమల్లు
కోఆర్డినేటర్ పోతుల రాజమల్లు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రజాగళం,ప్రజాకలం క్యూ  న్యూస్ అధినేత జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న,రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ఎక్కడ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలకు తన క్యూ న్యూస్ ఛానల్ మరియు శరణార్థి తెలంగాణ పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కు వారధిగా నిలుస్తూ ఎన్నో రకాల సేవలందించారని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేదాక నిరంతరం శ్రమించాడని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కొరకు కృషి చేశాడని తీన్మార్ మల్లన్న టీం జమ్మికుంట టౌన్ కోఆర్డినేటర్ పోతుల రాజమల్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న చేసిన సేవలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గత  వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించి గెలిపించుకున్న ఆయనను సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోయే మంత్రివర్గంలోకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధిష్టానం పరిశీలించి తీన్మార్ మల్లన్న కు  స్థానం కల్పించాలని తీన్మార్ మల్లన్న టీం సొసైటీ జమ్మికుంట పట్టణ కోఆర్డినేటర్ పోతుల రాజమల్లు కోరారు.