- మత్స్యకారుల కోసం ముందుండి పోరాడుతా
- కెసిఆర్ కి రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కమలాపూర్/ధనాధన్ న్యూస్: గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం లో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం లో 283 చెరువులు ఉన్నాయని అన్నారు. గతంలో కమలాపూర్ లో 16 లక్షల చాపలు వేస్తే ఈసారి కేవలం ఎనిమిది లక్షల చాపలు మాత్రమే వేశారని అన్నారు. గత సంవత్సరంలో జూలై సెప్టెంబర్ లో మూడు లక్షల 30 వేల చాపలు వేస్తే ఈసారి కేవలం 1,65 వేల చాపలు మాత్రమే వేశారని అన్నారు. కెసిఆర్ హయాంలో 84 కోట్లు ఖర్చుపెట్టి 85 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశామని అదేవిధంగా 26 కోట్లు ఖర్చు చేసి పదికోట్ల రొయ్య పిల్లలు కూడా వేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 3900 చెరువులు మాత్రమే ఉంటే మిషన్ కాకతీయ పేరుతో 26వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కేసిఆర్ ది అన్నారు. అలాగే 300 చెరువులలో పదికోట్ల రొయ్య పిల్లలు దేశమని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 16కోట్ల వ్యయంతో 17 కోట్ల చేపల పంపిణీ మాత్రమే చేశారని అన్నారు. కెసిఆర్ 110 కోట్లు ముదిరాజుల కోసం ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కెసిఆర్ కి రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజుల కోసం ఏడేళ్లలో 550 కోట్లు ఖర్చు చేసి 524 కోట్ల చాప పిల్లలను వేసి వారిని ఆదుకున్నారన్నారు. జూన్ లో పంపిణీ చేయాల్సిన చేపలను ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అలసత్వాన్ని ఎక్కడ మత్స్యకారులు నిలదీస్తారని తమపై నిందలు వేయడం మొదలుపెట్టారని అన్నారు.60ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ మత్స్యరంగం దారుణ వివక్షకు గురైతే, కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో మత్సరంగాన్ని అభివృద్ధికి దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. తెలంగాణ మత్స్య సంపద విలువ 2014-15లో 2,60,010 టన్నులు కాగా, 2023-24లో 4,39,513 టన్నులు పెరిగిందని, మత్స్యకారుల ఆదాయం నాడు రూ. 2,431 కోట్లు కాగా, 2023-24 నాటికి రూ. 6,514 కోట్లు పెంచిన ఘనత కూడా కేసీఆర్. దే నని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం 26,357 నీటి వనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేప పిల్లలను.. 300 నీటి వనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతియేటా మే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జూలై లేదా ఆగస్టులో పంపిణీని ప్రారంభించేదని, ఇప్పుడు ఎందుకు ఆలస్యం జరుగుతుందో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడతామంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ ప్రజల కోసమే పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
