సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఎస్ రమేష్ హుజురాబాద్ ఆర్డీవో మరియు మండల ప్రత్యేక అధికారి బి.శ్రీనివాస్ మండలంలోని వివిధ అభివృద్ధి పనులపై మరియు గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం మండల స్థాయి అధికారులు,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అంగన్వాడి టీచర్స్ , ఏఎన్ఎంమ్ ,సూపర్ వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంమ్,ఏడబ్ల్యుటి లను గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు.సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకవెల్లి పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఎమ్మార్వో దూల మంజుల,ఎమ్ఏవో వైదేహి,మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
