dhanadhannews.com
ఘనంగా వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారం మహోత్సవం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్ కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాలుగా సిరిపురం రాజేష్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్, ఎల్లంకి ప్రదీప్,లతోపాటు వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, రివిజన్ చైర్ పర్సన్ రామిడి శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ అయితు రమేష్, వాసవి క్లబ్ అధికారులు కె … Read more
రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్:మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ డాక్టర్ చెల్లీ అశోక్ కుమార్ ప్రత్యేక వాక్య సందేశం అందిస్తూ స్తుతి ఆరాధన నిర్వహించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గణాంకాల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర క్యాలెండర్లు అమల్లోకి … Read more
బోగస్ ఓట్లను తొలగించాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల … Read more
జమ్మికుంట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా మడికొండ సురేందర్ రావు ఎన్నిక
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా మడికొండ సురేందర్ రావు గారినిఎన్నుకోవడం జరిగినది వీరికి మద్దతుగా 11 మంది సర్పంచులు మద్దతు తెలిపారు.ఈ ఎన్నికలో గండ్రపల్లె సర్పంచ్ తోట కవిత- లక్ష్మణ్,బిజిగిరి షరీఫ్ సర్పంచ్ రాచపల్లి వనజ- రాజయ్య,వెంకటేశ్వర్ల పల్లె సర్పంచ్ పోల్సాని వినోద-నారాయణరావు, శంభుని పల్లె సర్పంచ్ రాసపల్లి కోమల-సదానందం, అంకుశాపురం సర్పంచ్ కావడి కుమారస్వామి, సైదాబాద్ సర్పంచ్ పూప్పల రాజారాము,పెద్దంపల్లి సర్పంచ్ ఎగిత పద్మ-కుమార్ ,జగ్గయ్య పల్లె సర్పంచ్ గట్టు … Read more
రంగాపూర్ కల్వరి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హుజురాబాద్,ధనాధన్ న్యూస్:మండల పరిధిలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో క్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నూతన వస్త్రాలు ధరించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సందడిగా సాంస్కృతిక ప్రదర్శనలు:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్యంగా … Read more
నిరాధార వార్తలు రాస్తే..చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేస్తాం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్ షిప్ పై నిరాధార వార్తలు రాస్తున్న,ప్రచురిస్తున్న పత్రికా, ఛానెళ్ల పై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేశామని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తనని రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిర్మాణం చేయబడ్డ … Read more
ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి
కరీంనగర్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సర్పంచ్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని,ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత … Read more
పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు:దాసరి రాజేశ్వర్ ధ్వజం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్, డిసెంబర్ 17:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పెన్షనర్ల హక్కులు హరించుకుపోతున్నాయని రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ ప్రెసిడెంట్, AIRRF సీఈసీ సభ్యులు దాసరి రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. AIRF, NCCCIPA, AISCCON సంఘాల పిలుపు మేరకు బుధవారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ‘పెన్షనర్స్ డే’ను బహిష్కరించి, ప్రభుత్వ తీరుకు నిరసనగా ‘పెన్షన్ రక్షణ దినోత్సవాన్ని’ శాంతియుతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షనర్లు తమ న్యాయమైన … Read more
అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య … Read more