16నెలలుగా ఫైల్ పెండింగ్..!డిపివోపై ఫిర్యాదు

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 2:జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) చీకోటి మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ 2025 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి బేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన చుక్క గంగారాజం, కోరుట్ల … Read more

పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెళ్లిన మాజీ సర్పంచుల అరెస్ట్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 1: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సైదాపూర్ మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాట్లాడుతూ, తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు … Read more

క్రికెట్ ఫీవర్..పోలీసుల స్పెషల్ నిఘా..!

హుజూరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 31 :ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. … Read more

నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నిర్వహించిన నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని అహర్నిశలు శ్రమించామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అసలైన ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ మేరకు జూన్ 2న వర్గ కేంద్రంలో … Read more

హీరోయిన్‌ ఛాన్స్‌ పేరుతో రూ.60 లక్షల టోకరా

హైదరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 29: సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. “సీరియల్‌లో హీరోయిన్‌ ఛాన్స్‌ ఇప్పిస్తా” అంటూ ఓ ప్రముఖ వైద్యుడి భార్యను నమ్మబలికిన కేటుగాడు, దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ మోసంలో విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బాధితురాలికి టెలివిజన్‌, వినోద … Read more

హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో … Read more

గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం … Read more

ధనాధన్ న్యూస్ లో ప్రచురితమైన కథనానికి స్పందన

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న గోనెసంచుల సమస్యపై ధనాధన్ న్యూస్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. రైతులకు గోనెసంచులు అందించేందుకు నిరాకరించిన యజమాని, వార్త ప్రచురితమైన అనంతరం మంగళవారం ఉదయం వెంటనే సంచులు అందజేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ రైతుల సమస్యను పట్టించుకోని యజమాని వైఖరిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధనాధన్ న్యూస్‌లో కథనం వెలువడిన తర్వాత … Read more

మక్క కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం

సైదాపూర్/ధనధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పది రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక టెండర్ యజమాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. … Read more

ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్,మే 25:ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ… మరోవైపు ఇసుక ఆన్‌లైన్ సమస్యలు లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇసుక అందుబాటులో లేక ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇసుక ఆన్‌లైన్‌లు అందుబాటులో లేకపోవడం, అనంతరం ఒక్కసారిగా భారీ సంఖ్యలో అనుమతులు జారీ కావడంతో ట్రాక్టర్లు, కార్మికులు … Read more