రైతు ఉత్సవాల పేరుతో ‘అన్నదాత’కు అవమానం

సిద్దిపేట/ధనాధన్ న్యూస్:ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఉత్సవాలు’ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తామంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతులను సిద్దిపేటకు తరలించిన అధికారులు, కనీసం వారికి సరైన భోజన వసతి కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ రైతు ఉత్సవాల పేరుతో పిలిచి రైతులను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం … Read more

సెయింట్ థామస్ పాఠశాలలో  గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే  ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో … Read more

పాత పద్ధతిలో హుజూరాబాద్‌ను మళ్లీ చేసుకుందాం

కమలాపూర్/ధనాధన్ న్యూస్:హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం శనిగరం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి రాజు (ఉంగరం గుర్తు), వార్డు మెంబర్ల తరఫున గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ తమ కృషిని గుర్తు చేశారు. “హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఫోర్ లైన్ రోడ్లు వేయించాం. ఎప్పుడూ … Read more

గోనె సంచిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి … Read more

ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను … Read more