మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

By dhanadhannews.com

  • 5 వేల కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించాలి
  • మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల 14న కరీంనగర్ వి కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు మున్నూరు కాపు యువగర్జన సమావేశం ఉంటుందని కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో మున్నూరు కాపు యువత తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు.పటేల్ గెజిట్ కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఉందన్నారు.మున్నూరు కాపు కార్పొరేషన్ కు 5 వేల కోట్లు కేటాయిస్తే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుల బాంధవుల పిల్లల చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారన్నారు. మున్నూరు కాపులు ఐకమత్యంతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా,విద్య, ఉద్యోగపరంగా వెనుకబడి పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని రాజకీయ పార్టీలలో రాజకీయంగా మున్నూరు కాపులకు సంఖ్యాపరంగా రిజర్వేషన్ కల్పిస్తూ,సముచిత స్థానం కల్పించాలని  డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కుల పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు ఆర్థిక కార్పొరేషన్ కేటాయించి,ఆదుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొత్తూరి రాజేందర్, బరిగెల అనుదీప్, కౌన్సిలర్లు పొనగంటి రామ్మూర్తి, పొనగంటి సారంగం,మేడిపల్లి రవీందర్ సీనియర్ రిపోర్టర్లు కొలకాని రాజేందర్,పంతాటి రవీందర్,నాయకులు ఆకుల నారాయణ,పొనగంటి సతీష్,పొనగంటి శ్రీధర్,ప్రభాకర్,వెంకన్న,కొమురయ్య తదితరులు ఉన్నారు.