జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టడం వలన నాలుగు లక్షల ఆటో కార్మికులు రోడ్డున పడ్డామని కావున ఇట్టి పథకాన్ని ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బందు చేసి తెలంగాణ ప్రభుత్వానికి తమ నిరసనలు వ్యక్తం చేశారు. మరియు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెండింగ్ చాలాన్లు రద్దుచేసి తమకు న్యాయం చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం 12,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ మారపల్లి శ్రీనివాస్,హుజురాబాద్ నుండి జమ్మికుంట రూటు టౌన్ ప్రెసిడెంట్ గుడ్ల కిట్టయ్య,కొత్తపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మంథిని శ్రీహరి,వైస్ ప్రెసిడెంట్ ధరుగుల కుమార్,క్యాషియర్ నేరెళ్ల రంజిత్ మరియు డ్రైవర్స్ ఎండి హబీబ్,కే.శ్రీనాథ్,బి.మల్లేష్,ఎం. సుక్కయ్య,కే.ప్రవీణ్,తదితరులు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
