సైదాపూర్ మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్

సైదాపూర్, అక్టోబర్ 19 :తెలంగాణ రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను సైదాపూర్ మండలంలో కూడా విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలన్నింటిలో వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మండల బిసి జేఏసీ అధ్యక్షుడు జంపాల భూపతి మాట్లాడుతూ —“బీసీలకు 42 శాతం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఆ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా … Read more

42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని  ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా … Read more

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో భాగంగా చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది అనంతరం హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూస్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి, ఆదరించాడు. నిజాంషాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి … Read more

బి.సిల హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలి

•హుజూరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బి.సిల హక్కుల సాధన కోసం చట్టం,న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు.బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న  తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ … Read more

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ … Read more

మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..

హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి … Read more

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY)జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ నియామకం

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ గారిని నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.బీసీల రాజకీయ అధికారం కోసం,బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ … Read more