digitalmedia
ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!
సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”! ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, … Read more
జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రాయికల్ గ్రామ రైతులు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీవో సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డిఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12 లక్షల 20,000 ఇస్తారని హుజురాబాద్ … Read more
ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ … Read more
పట్టభద్రులకు,ప్రభుత్వానికి వారధిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా … Read more
బీమా చట్ట సవరణ బిల్లు 2024 ను తిరస్కరించాలి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్:కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న 2024 బీమా చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరు తిరస్కరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి కోరారు. బీమా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా వచ్చే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కుమార్ స్వామి మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో … Read more
సగర సంఘ సేవలు అభినందనీయం
వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ … Read more
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత … Read more
ఆకునూరు గ్రామపంచాయతీలో డి.ఎల్.పి.ఓ విచారణ
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణంలో, స్మశాన వాటికల పనుల్లో అప్పటి పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై హుజురాబాద్ ఇన్చార్జి డి.ఎల్.పి.ఓ శ్రీనివాస్ ఫిర్యాదు దారుడితోపాటు,మాజీసర్పంచ్ రమణ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు.విచారణ చేసిన నివేదికను పై అధికారులకు అందజేస్తానని డి ఎల్ పి ఓ పేర్కొన్నారు.ఈ … Read more
అపార్ ఐడీ నమోదు వేగవంతం చేయాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రతి విద్యార్థి యొక్క అపార్ ఐడీ వివరాలను యూడైస్ ప్లస్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జమ్మికుంట ఇంచార్జ్ మండల విద్యాధికారి మంతెన హేమలత పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు సందర్శించారు..ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్ ప్లస్ విధానంలోకి విద్యార్థుల వివరాలను … Read more