గ్రామానికి అండగా విగ్రహ ప్రతిష్టాపనలు
వీణవంక మార్చ్ 27:వీణవంక మండలంలోని చల్లూరు,మామిడాలపల్లి పలు దేవాలయాల్లో,దేవాలయ ఉత్సవాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.చల్లూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు వేదమంత్రాలతో హారతి సమర్పిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు అందజేశారు.రథోత్సవం సందర్భంగా రథంపై టెంకాయ కొట్టి పూజలు జరిపారు. అనంతరం అదే గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు పాల్గొని,మహిళలతో … Read more