ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: రోడ్డు మీద అంబులెన్సు వస్తుందంటే మనం ఎంత పనిలో ఉన్న అందులో ఉన్న పేషేంట్ ప్రాణాలు నిలువాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ,బండికి సైడ్ ఇస్తాము.కానీ అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానుల నిర్లక్ష్య వైఖరిలతో ప్రాణాలకు చేటు చేకూరుతుంది.వీళ్ళ నిర్వాహకం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..కనీసం వాహనాల్లో మౌలిక  వసతులు లేకుండా,కనీసం డీజిల్,పెట్రోల్ కూడా చూసుకోకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.కనీసం ప్రథమ చికిత్స చేసే టెక్నీషియన్ కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల … Read more

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని ఈ తరుణంలో మహిళా లోకం మరింత … Read more

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

ఆసుపత్రిలో చేరిన తమిళ్ హీరో అజిత్ కుమార్

ప్రముఖ సినీనటుడు అజిత్ కుమార్ ఈరోజు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.సినిమా షూటింగ్ సమయంలో బాడీ సహకరించ కపోవడంతో సాధారణ శారీరక పరీక్షల నిమిత్తం అజిత్‌ ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.ప్రస్తుతం ఆయన మగిజ్ తిరుమేని దర్శకత్వంలో‘విడముయార్చి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా గత కొన్ని రోజులుగా షూటింగ్ ఆగిపోయింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు

జమ్మికుంట లో ఉచిత మెగా వైద్య శిబిరం

జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో … Read more

ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారీ గీత కార్మికునికి గాయాలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత … Read more

ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందించాలి.

సంఘటనపై స్పందించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల కరెంటు ఉండేలా చూసుకోవడంతో పాటు నిరంతరం నీటి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల ప్రసవం సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి అభివృద్ధి కోసం జిల్లా మంత్రుల లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … Read more