న్యాయం కోసం సహారా ఏజెంట్లు ఎదురుచూపు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సహారా ఇండియా ఏజెంట్లు,ఖాతాదారులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలన్నారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని,సుప్రీంకోర్టు వడ్డీతో సహా బాధితులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. … Read more