జగ్గయ్యపల్లిలో చిరుతల రామాయణం ప్రదర్శన ప్రారంభం

జమ్మికుంట ఏప్రిల్ 04:మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు  అన్నారు.బుధవారం జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  జమ్మికుంట మున్సిపల్ చైర్మన్  తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు,జగ్గయ్యపల్లి మాజీ సర్పంచ్ వంశీధర్ రావు,రామాయణ కళా గురువు కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య ఉపాధ్యక్షుడు బోళ్ళ కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ చేతుల మీదుగా జ్యోతి … Read more

రైతులకు నీళ్లు ఇస్తారా గేట్లు ఎత్తమంటారా తేల్చుకోండి

కమలాపూర్ ఏప్రిల్ 03:తెలంగాణ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని, నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ … Read more

సర్వాయి పాపన్న గుట్టని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

సైదాపూర్ ఏప్రిల్ 2:సర్వాయిపేట పరిసర ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గుట్ట ను పర్యాటక కేంద్రం కోసంసీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సర్వాయిపేట మహ్మదాపూర్ గ్రామల నడుమ ఉన్న సర్వాయి పాపన్న గుట్ట మీద ఉన్న పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.సర్దార్ … Read more

నల్లానితండాలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేడు ఐకేపీ,పౌరసరఫరాల శాఖ ల ఆధ్వర్యం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నల్లాని తండా లో ప్రారంబిస్తున్నామని సెర్ప్ ఏపిఎం చెన్నబోయిన కుమారస్వామి తెలిపారు.రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,ఘనపూర్, ఆకునూరు,వెంకేపల్లి లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

జమ్మికుంట మార్చ్ 31:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు,స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు,పుర ప్రముఖులు,రాజకీయ నాయకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన … Read more

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ … Read more

గురుకుల పాఠశాలల నూతన భవనాలు నిర్మాణం ఎప్పుడు?

సైదాపూర్ మార్చ్ 30:సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపుర్ లోనే నూతన భవనం నిర్మించాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కోరారు.వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని నూతన భవనాలు నిర్మించాలని,ఎన్ని మార్లు కోరినా పట్టించుకోలేదని  గత కొన్ని సంవత్సరాలుగా సైదాపూర్ గురుకుల పాఠశాల హుజురాబాద్ … Read more

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

జమ్మికుంట మార్చ్ 30:జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆయన వర్గీయులు శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని,ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ … Read more

ప్రణవ్ బాబు కు సోలార్ ఫ్యాన్ టోపీని బహూకరించిన సాదుల రాంబాబు

వేసవి కాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కాంగ్రెస్ వీరాభిమాని సాదుల రాంబాబు దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సోలార్ ఫ్యాన్  పరికరంతో క్యాప్ లో ఇమిడే విధంగా సోలార్ ఫ్యాన్ తయారుచేసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు సింగపూర్ లోని తన నివాసంలో బహుకరించారు.అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోలార్ ఫ్యాన్ టోపీని ఉగాది సందర్భంగా అందజేసేందుకు అవకాశం కల్పించాలని ప్రణవ్ ను కోరారు.వెంటనే స్పందించిన ప్రణవ్ ముఖ్యమంత్రి … Read more

గ్రామానికి అండగా విగ్రహ ప్రతిష్టాపనలు

వీణవంక మార్చ్ 27:వీణవంక మండలంలోని చల్లూరు,మామిడాలపల్లి  పలు దేవాలయాల్లో,దేవాలయ ఉత్సవాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.చల్లూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు వేదమంత్రాలతో  హారతి సమర్పిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు అందజేశారు.రథోత్సవం  సందర్భంగా రథంపై టెంకాయ కొట్టి పూజలు జరిపారు. అనంతరం అదే గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో  జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు పాల్గొని,మహిళలతో … Read more