- ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్
- గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంటర్ విద్యార్థి విద్యుద్ఘాతంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ తెలిపారు. శనివారం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఊరంతా విషాదచాయలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపైన చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్లో నవరాత్రుల కోసం మండపాల అలంకరణ,నిమజ్జనం సమయాల్లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల విద్యుద్ఘాతం,రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు గాయపడి, మరికొందరు మృత్యువాత పడిన ఘటనలు వారి కుటుంబాలలో తీరని దు:ఖాన్ని మిగులుస్తున్నాయని వివరించారు.గణేశ్ మండపాల వద్ద యువతీ యువకులు,నిర్వాహకులు, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల రీత్యా, మండపాల అలంకరణ కోసం విద్యుత్తు సరఫరా విషయంలో,వినాయక నిమజ్జన సందర్భంగా చెరువుల దగ్గర నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సబ్బని వెంకట్ విజ్ఞప్తి చేశారు.
