- సైదాపూర్ తహశీల్దార్ దూలం మంజుల
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన,రుచికరమైన,పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని వంట చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా కూరగాయలు వినియోగించాలని తహశీల్దార్ దూలం మంజుల సూచించారు.త్వరలో మధ్యాహ్నం భోజన కార్మికులకు వంట సామాగ్రి మంజూరు కానుందని వారి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎన్ఓ రవీంద్రా చారి,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,ఎంఐఎస్ వరలక్ష్మి,సిఆర్పి రమేష్ తదితరులతో పాటు మండలములోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
