వీణవంక మండలంలో కాంగ్రెస్ ప్రచార జోరు!

వీణవంక/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది. శనివారం రోజున బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టం పేట, గంగారం, చల్లురు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, బాణాసంచా కాల్పులతో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను … Read more

కనగర్తి ప్రజలారా! ఇది కేవలం ఎన్నిక కాదు, మన గ్రామానికి ‘పునర్జన్మ’!

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: గ్రామ చరిత్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి, పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన శ్రీమతి బండి సంధ్యారాణి మల్లేష్ తీవ్ర ఉద్వేగంతో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఈ ఎన్నికను కేవలం పదవి కోసం కాదని, గ్రామానికి పునర్జన్మ ఇవ్వడం కోసం జరుగుతున్న చారిత్రక పోరాటంగా అభివర్ణించారు.జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ సతీమణి అయిన సంధ్యారాణి మల్లేష్ మాట్లాడుతూ, “మీరు నన్ను 10 ఏళ్లుగా … Read more

పాత పద్ధతిలో హుజూరాబాద్‌ను మళ్లీ చేసుకుందాం

కమలాపూర్/ధనాధన్ న్యూస్:హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం శనిగరం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి రాజు (ఉంగరం గుర్తు), వార్డు మెంబర్ల తరఫున గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ తమ కృషిని గుర్తు చేశారు. “హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఫోర్ లైన్ రోడ్లు వేయించాం. ఎప్పుడూ … Read more

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదనీ,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూర్ ఎమ్మెల్యే … Read more

జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని … Read more

హుజురాబాద్ ఎంఈఓ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ కి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అధికార దుర్వినియోగం జరిగింది … Read more

ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!

సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”! ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, … Read more

కొత్తపల్లిలో మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామం నిన్న (మంగళవారం) ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి తన 18వ పడి సందర్భంగా మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్యమోతే తిరుపతి గురుస్వామి, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో … Read more

దళిత బంధు నిధులపై వివక్ష ఏంది!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుడిపై కోపాన్ని … Read more

ఐబొమ్మపై సీపీఐ నారాయణ సంచలనం

హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ అంశాలపై స్పందిస్తూ ఆయన వ్యవస్థాగత లోపాలను తీవ్రంగా దుయ్యబట్టారు.ఐబొమ్మలో సినిమాలు చూసిన నారాయణఐబొమ్మ వ్యవహారంపై మాట్లాడిన నారాయణ, తాను కూడా ఆ వెబ్‌సైట్‌లో సినిమాలు ఫ్రీగా చూసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. “ఆరేడు వందలు పెట్టి సామాన్యులు సినిమాలు ఎలా చూసేది? నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు … Read more