హుజురాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ ప్రాంతంలో ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ సంతోష్ మరియు ఆయన ధర్మపత్ని అనిమ దంపతులు తమ స్వంత ఆర్థిక సహకారంతో మహా దివ్య పడిపూజ మరియు స్వాములకు భిక్ష కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వరంగల్ రోడ్డులోని పరకాల క్రాస్ సమీపంలో గల వాసవి ఇండస్ట్రీస్‌ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణం ఈ దివ్య కార్యక్రమానికి వేదికైంది. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో … Read more

ఇసుక మాఫియా దొంగలు మీరు

జమ్మికుంట/ధననాధన్ న్యూస్: కొబ్బరికాయల దొంగేవడు అంటే భుజాలు తడుముకున్నట్లు బీఆర్ఎస్ నాయకుల వ్యవహార తీరు ఉందని పత్తి కృష్ణా రెడ్డి తెలిపారు.ఆదివారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాను మొదలు పెట్టిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మాణ లోపంతో కుంగిపోయిన చెక్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బాంబులతో కూల్చేశారని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల శంభుని పల్లి గ్రామం … Read more

ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టణ ప్రజల ప్రాణాల పట్ల వారి ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం. బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ఒకవైపు రిలయన్స్ పెట్రోల్ పంపుకు ముందు, మరొకవైపు బస్టాండ్‌కు వెళ్లే దారిలో భారీగా, ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు గత కొంతకాలంగా వాహనదారులకు,స్థానికులకు నరకాన్ని చూపుతున్నాయి.ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం మున్సిపాలిటిని రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉంచుతున్న మున్సిపల్ అధికారులు , పట్టణ … Read more

గోనె సంచిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి … Read more

ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను … Read more

చెక్ డ్యాం కుంగడంపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాం కుంగిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం తీవ్రంగా ఖండించారు. రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రణవ్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే చర్యలుచెక్ డ్యాం కుంగడంపై ప్రస్తుతం విచారణ … Read more

ఇసుక మాఫియా చెలరేగిపోతోంది: హరీష్ రావు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తూ టెర్రరిస్టులను మించిపోయే విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రూ. 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేయడాన్ని ఆయన ఖండించారు.తనుగుల చెక్‌డ్యామ్‌ను శుక్రవారం సందర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, చెక్‌డ్యామ్‌ను పేల్చివేయడం వేలాది మంది రైతులపై జరిగిన ప్రత్యక్ష దాడి అని … Read more

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు: ఒడితెల ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక … Read more

మల్లన్నపల్లి గ్రామ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తా: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గంధం రవీందర్

ఇల్లందకుంట, నవంబర్ 25: ఇల్లందకుంట మండల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం తాను అలుపెరుగని పోరాటం చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న గంధం రవీందర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.మంగళవారం గంధం రవీందర్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో … Read more

గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు … Read more