న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన … Read more

నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని … Read more

అనాధ శరణాలయంలో రాజేష్ ఠాకూర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట లోని స్థానిక స్పందన అనాధాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది.అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది.రాజేష్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజలకోసం పోరాటాలు చేయడం,తన తండ్రి సీనియర్ నాయకులు దివంగత రవి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయిలో ఉండడం వారి … Read more

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ తన భార్యకు వైద్యం చేయించడం కోసం తన స్తోమత మేరకు డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ట్రీట్‌మెంట్‌కు మరిన్ని డబ్బులు అవసరం కాగా, డబ్బులు లేక … Read more

నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో  కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను … Read more

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం  మూడవసారి  ఏర్పడ్డాక ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై స్పందించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తుందని,దానికి అనుగుణంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని సంపత్ రావు … Read more

గీత కార్మిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాచర్ల నగేష్ గౌడ్ బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందాడు మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు … Read more

జర కరుణించ రాదమ్మ వానమ్మా
ఎదురు సూడవట్టే నీకై నేలమ్మా

అనపురం రమేశ్ గౌడ్ ఎంఏ. ఆ పాదాలు బురదలో దిగితేనే అన్నం మెతుకులు లేకుంటే అన్నమో రామచంద్రా ఆ చేతులు మట్టిని తాకితేనేఆకలి దూరంలేకుంటే ఆగం బతుకులుఆ శరీరం వానలో తడుస్తనేలోకానికి ఆశలులేకుంటే అడియాశలు ఆ జీవి పోలంలోన సెమట చిందిస్తేనేజనాలకు వెలుగులులేకుంటే చిమ్మ చీకట్లుఆ జీవి ఆరుగాలం శ్రమిస్తేనేఅందరికీ ఆనందంలేకుంటే ఆకలి కేకలుమరి ఆ జీవికి ఎన్ని ఇక్కట్లో వాన చినుకుల కోసం ఎదురు చూపులు పెట్టుబడి కోసం పడిగాపులుఅతివృష్టి అనావృష్టిల పోరాటంవిషపురుగులతో చెలగాటంలోకం కోసం … Read more

బిస్లరీ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని బిస్లరీ వాటర్ ప్లాంట్ ను స్రవంతి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం సందర్శించినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ బిస్లరీ వాటర్ ప్లాంట్  సందర్శించిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారని తెలియజేశారు. కార్మికులు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా పని … Read more

అగ్ని ప్రమాద చిరు వ్యాపారులకు పోలీసుల చేయూత

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: నిన్న రాత్రి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు.హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ.3000 చొప్పున 30,000 నగదును పదిమందికి అందజేశారు.అగ్ని ప్రమాదం సంభవించి చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేయడం అత్యంత … Read more