సోమనపల్లి వాసికి డాక్టరేట్

అంతర్గామ్,ధనాధన్ న్యూస్:పెద్దపెల్లి జిల్లా,అంతర్గాం మండలం,సోమనపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల దామోదర్ కి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన CSIR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) హైదరాబాద్ మరియు అకాడమీ అఫ్ ఇన్నోవాటివ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఘజియాబాద్ , న్యూ ఢిల్లీ (యూనివర్సిటీ ) నుండి ఈరోజు కెమికల్ సైన్స్ పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందడం జరిగింది.ప్రస్తుతం అరేజన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో అసోసియేట్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు.దామోదర్ కి డాక్టరేట్ పొందడం వల్ల … Read more

హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డ్ (NQAS)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు.గురువారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ మేరకు అందుకున్న అవార్డును కలెక్టర్ కు అందజేశారు.95 శాతం అచీవ్‌మెంట్ సాధించినందుకు ఏరియా హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని … Read more

కాంగ్రెస్ పార్టీ లో చేరిన కమలాపూర్ ఎంపీపీ

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కమలాపూర్ మండలం ఎంపిపి తడ్క రాణి శ్రీకాంత్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ  నుండి దాదాపు 50 మందికి పైగా ముఖ్యనేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రణవ్ నాయకత్వం లో … Read more

మంత్రిని కలిసిన జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రిని కోరడం జరిగింది.మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని చెప్పడం జరిగిందని జమ్మికుంట కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి మల్లయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి,కౌన్సిలర్లు బొంగోని వీరన్న,ఎలగందుల సరూప శ్రీహరి,పిట్టల … Read more

విద్యాసంస్థల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మండలం మరియు, జమ్మికుంట మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇమ్రాన్,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,జిల్లా కార్యదర్శి అభిలాష్,గాలి నరేష్,పిడిఎస్యూ జిల్లా … Read more

నేత్రదానంతో ఇద్దరికి చూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల వెంకటయ్య అనారోగ్యంతో  బుధవారం మృతి చెందడం జరిగింది.వారి సమీప బంధువు,సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి అయిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు వారికి నేత్రదానంపై అవగాహన కల్పించగా వారు ఒప్పుకోవడంతో,కరీంనగర్ జిల్లా సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో,వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు కృష్ణమూర్తి-రాధిక,భాస్కర్-జ్యోతిలకు,కూతుర్లు అల్లుండ్లు భాగ్యలక్ష్మి,(కీ.శే.రాజన్న),రమాదేవి సుధాకర్ … Read more

తీన్మార్ మల్లన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రజాగళం,ప్రజాకలం క్యూ  న్యూస్ అధినేత జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న,రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ఎక్కడ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలకు తన క్యూ న్యూస్ ఛానల్ మరియు శరణార్థి తెలంగాణ పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కు వారధిగా నిలుస్తూ ఎన్నో రకాల సేవలందించారని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేదాక నిరంతరం శ్రమించాడని కాంగ్రెస్ ప్రభుత్వం … Read more

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు … Read more

ప్రజాకవి సత్యంగౌడ్ కు జాతీయస్థాయి జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కార ప్రధానం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు,వ్యక్తిత్వ వికాస నిపుణులు,డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి జ్ఞాన బుద్ధ పూర్ణిమ పురస్కారాన్ని అందుకున్నారు.మాజీ ప్రధాని భారతరత్న పి.వి నరసింహారావు జయంతి ఉత్సవాలు 2024 సంవత్సరంను పురస్కరించుకొని తెలుగు వెలుగు సాహితీ సంస్థ,విశ్వకర్మ వేద పురోహిత పాఠశాల వేములవాడ,శ్రీ విరాట్ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్,పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక … Read more

డయాగ్నొస్టిక్,స్కానింగ్ సెంటర్లు అధిక ఫీజులను నియంత్రించాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డయాగ్నస్టిక్ సెంటర్,స్కానింగ్ సెంటర్ లు అధిక ధరలు పెంచి  మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్ ల యాజమాన్యలపైన విచారణ చేయాలని పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని ఆయనకోరారు.సోమవారం రోజున  అధిక ఫీజులు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ లో విచ్చల విడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆఫర్ ల  పేరుతో … Read more